16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ నరేన్ మరోసారి థ్రిల్ చేయడానికి సిద్దమయ్యాడు. అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో.. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తమిళ్ లో నరగసూరన్ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తెలుగులో నరకాసురుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నరకాసురుడు టైటిల్ తో లీడ్ క్యారెక్టర్స్ అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియలు సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా తెలుగు వర్షన్‌ను రమేష్ వర్మ ప్రొడక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా విడుదల చేయనున్నారు.
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: