లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి.. పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవర కొండ. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకు అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా కొంతమందికి స్టార్ డమ్ అనేది అంత తొందరగా రాదు… కానీ విజయ్ దేవరకొండకు మాత్రం చాలా తక్కువ టైంలోనే ఇంత స్టార్ డమ్ రావడం నిజంగా అదృష్టమే. అలా అని అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా..మనలో టాలెంట్ కూడా ఉండాలి.. మంచి కథలు కూడా ఎంచుకోవాలి. ఈ రెండూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఢిపరెంట్ స్టోరీస్ ఎంచుకోబట్టే ఇప్పుడు ఈస్థాయిలో ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాదు.. పక్కన ఇండస్ట్రీ వాళ్లు కూడా విజయ్ తో చేయాలని ఉందని చెబుతున్నారంటేనే తను ఎంత సక్సెస్ అయ్యాడో చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇవన్నీ తెలిసిన విషయాలే కదా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకబ్బా అని డౌట్ రావచ్చు. అసలు సంగతేంటంటే.. ఇటీవలే ఫోర్భ్స్ జాబితాలో అండర్ 30 లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు రాగా ఇప్పుడు మరోసారి తన సత్తా చాటాడు విజయ్. గత ఏడాదే హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017 లిస్ట్‌లో టాలీవుడ్ స్టార్‌లకు షాక్ ఇచ్చాడు. ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. వాళ్లందరినీ వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు.
ఇప్పుడు తాజాగా చైన్నై టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లో విజయ్ దేవరకొండ కూడా టాప్ 10 లో నిలిచాడు. అది కూడా టాప్ 3లో. మరి ఇది నిజంగా సంతోషించాల్సిన విషయమే కదా. ఎందుకంటే.. ఏదో ఇక్కడ మన టాలీవుడ్ లో అంటే అనుకోవచ్చు కానీ.. పక్క రాష్ట్రంలో ఎంతో మంది హీరోలు ఉన్నా కానీ.. మన తెలుగు యంగ్ హీరో మోస్ట్ డిజైరబుల్ 2018 లిస్ట్ లో టాప్ లో చోటు దక్కించుకోవడం నిజంగా గ్రేటే.
చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2018
1. Anirudh
2. Atharvaa murali
3 Vijay Deverakonda
4. Harishkalyan
5. Siva Kartikeyan
6. Dhanushkraja
7. STR
8. DulQuer
9. Aadhi Pinisetti
10. Nafeez Arav
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కు తమిళ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో మొత్తానికి ఈ యంగ్ హీరోకు అటు తెలుగుతో పాటు ఇటు తమిళ్ లో కూడా ఇంత క్రేజ్ రావడం నిజంగా హర్షించతగ్గ విషయం. ఇలానే విజయ్ ముందు ముందు కూడా మంచి మంచి సినిమాలతో కెరీర్ లో దూసుకుపోవాలని కోరుకుందాం..
[youtube_video videoid=cK639mJlOg8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: