రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్ పై రాజమౌళి కొన్నికీలక సీన్లు తెరకెక్కిస్తుండగా… ఎన్టీఆర్ కూడా తన ట్రైనింగ్ ను స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై కూడా గత కొద్దిరోజులుగా పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారన్న వార్తలు వచ్చినా దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు కూాడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు అజయ్ దేవగన్. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాలో చాలా కీలకమైన పాత్ర అవ్వడం వల్ల రాజమౌళిపై ఉన్న నమ్మకంతోనే అజయ్ దేవగన్ ఈ చిన్నపాత్రకు ఒప్పుకున్నాడట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈగ సినిమా హిందీ డబ్బింగ్ సమయంలో ఈ సినిమాకు అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్ అందించారు. మరి ఆ అనుభవంతో ఏమైనా ఒప్పుకున్నారేమో చూద్దాం.. ఇందులో నిజమెంతుందో…!
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: