ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

Popular Telugu Director & Producer Vijaya Bapineedu Passes Away,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Tollywood Director & Producer Vijaya Bapineedu Latest News,Director and Producer Vijaya Bapineedu No More,Telugu Film Director Vijaya Bapineedu Passes Away at 82
Popular Telugu Director & Producer Vijaya Bapineedu Passes Away

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్ను మూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌ లో ఉంచారు. రేపు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1936 సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో బాపినీడు జన్మించారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో బీఏ పూర్తిచేసిన బాపినీడు.. కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. తరవాత చెన్నైలో ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ మ్యాగజైన్లను ప్రారంభించారు. ‘విజయ’లో వచ్చిన బాపినీడు సినిమా రివ్యూలు అప్పట్లో విపరీతంగా ప్రేక్షకాదరణ పొందాయి. దీంతోనే ఆయన పేరు విజయ బాపినీడుగా మారింది. తరువాత సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు.

1982లో దర్శకుడిగా మారిన ఆయన తెలుగులో 22 చిత్రాలను రూపొందించారు. ‘డబ్బు డబ్బు డబ్బు’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న బాపినీడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. డబ్బు, డబ్బు, డబ్బు, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టుకాటుక అనే సినిమాలను తీశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ అనుబంధం ఉండేది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో హిట్ సినిమాలు అందించారు. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’ సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్ ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించడం విశేషం. చిరంజీవితో పాటు శోభన్‌బాబు, కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లతో కూడా బాపినీడు పలు సినిమాలు తీశారు. విజయ బాపినీడు చివరి చిత్రం 1998లో తెరకెక్కిన ‘కొడుకులు’.

దర్శకుడిగా 22 సినిమాలు తెరకెక్కించిన బాపినీడు… వాటిలో 12 చిత్రాలను ఇతర దర్శకులతో తీయగా, మిగితా సినిమాలను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. టాలీవుడ్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయే చిత్రాలను అందించారు.

[subscribe]

[youtube_video videoid=PdY3bdPFXf0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =