రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. జూన్ 27వ తేదీన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ను కూడా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ టీజర్ తర్వాత కల్కి సినిమాపై అంచనాలు స్కై లెవెల్‌కి చేరాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడి ప్రతిభకు అచ్చెరువొందుతున్నారు. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన బుజ్జి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో.. “కల్కి నుండి బుజ్జి టీజర్‌ని పరిచయం చేయడంతో నాగి ఏమి చేస్తున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఇది నా అంచనాలను మించిపోయింది. ప్రభాస్ అన్న.. నీ నవ్వు కేక్‌పై ఐసింగ్గా ఉంది. సంతోష్ సార్ మీరు గొప్ప సంగీతం అందించారు. ఈ మూవీ చూడటం కోసం ఇక వేచి ఉండలేను” అని పోస్ట్ చేశారు.
Introducing Bujji teaser from #Kalki has exceeded my expectations of what Nagi is up to and to see Prabhas anna smiling and having a ball is icing on the cake. Great score @Music_Santhosh sir. Can’t wait.
— Nani (@NameisNani) May 23, 2024
కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























