రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి పై ప్రశంసలు కురుస్తున్నాయి.నిన్న ఈసినిమా నుండి బుజ్జి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఈవెంట్ జరిగింది.ఇక ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ తో పాటు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.టీజర్ లోని విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో వుండడమే ఇందుకు కారణం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ఈ టీజర్ తో చెప్పేశాడు.గ్లోబల్ మూవీ గా వస్తున్న కల్కి పై అంచనాలను రెట్టింపు చేసింది నిన్న వచ్చిన టీజర్.ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఎలావుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కల్కిలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్ ,దీపికా పదుకోణ్ ,దిశా పటాని తో పాటు తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా ఈసినిమా జూన్ 27న థియేటర్లలోకిరానుంది. ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ తరువాత హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో మిగితా వెర్షన్ లు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.ఈడీల్ భారీ ధర పలికిందట.
ఇక ప్రభాస్ ఈసినిమా విడుదల తరువాత రాజా సాబ్ తో బిజీ కానున్నాడు.మారుతి డైరెక్షన్ లో వస్తుంది ఈసినిమా.ఆగస్టు లోపు రాజా సాబ్ షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు. ఆతరువాత ఏడాది చివర్లో సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ చేయనున్నాడు ప్రభాస్. నిజానికి ఈ మధ్యలో సలార్ 2 కూడా చేయాల్సివుంది కానీ ఈసినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లేలా వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























