టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మౌళి’. ఇటీవల ఇతర హీరోల చిత్రాలలో కనిపిస్తున్న నవదీప్ కొంత విరామం తర్వాత ఇందులో సోలో హీరోగా నటిస్తుండటం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ వినూత్నంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే రిలీజ్ అవ్వాల్సింది. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 19వ తేదీన లవ్ మౌళిని రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలోనే ‘లవ్ మౌళి’ కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. జూన్ 7వ తేదీన ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. కాగా ఈ చిత్రంలో నవదీప్ చాలా డిఫరెంట్‌గా కనిపించడంతో ఈ సినిమాను నవదీప్ 2.O గా పిలవడం జరుగుతోంది. విభిన్న ప్రేమకథలు కోరుకునే ప్రేక్షకులందరికి ‘లవ్ మౌళి’ మనసులకు హత్తుకుంటుందని చిత్ర బృందం తెలిపింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























