ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే?

NTR and Prashanth Neel Combo Movie Shoot Begins From August 2024

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోమవారం 41వ జన్మదినం జరుపుకుంటున్నారు. కాగా ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తన 30వ చిత్రంగా ‘దేవర’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తారక్ తదుపరి సినిమాలకు సంబంధించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రం చేయనున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ ఒక క్రేజీ అప్‌డేట్ అందించింది. వీరిద్దరి కాంబోలో రూపొందనున్న సినిమా ఎప్పటినుంచి సెట్స్ పైకి వెళ్లనుందనేదానిపై తాజాగా స్పష్టతనిచ్చింది చిత్రబృందం. ఈ క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమవనున్నట్లు ప్రకటించింది. ఇదిలావుంటే, మరోవైపు ఎన్టీఆర్ ‘వార్ 2’ అనే హిందీ మూవీలో కూడా నటిస్తోన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ప్రధానపాత్రను పోషిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.