ఫిబ్రవరిలో మలయాళం లో వచ్చిన మంజుమ్మళ్ బాయ్స్ మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా 250కోట్ల గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఈసినిమా తమిళనాడులో కూడా అదరగొట్టింది.దాదాపు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకొని హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. తెలుగులో కూడా విడుదలకాగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.ఈసినిమాను చిదంబరం డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా చిదంబరంకు భారీ ఆఫర్ ను తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంజుమ్మల్ బాయ్స్ ను దాదాపుగా కొత్త వాళ్ళతోనే తీయగా తన నెక్స్ట్ మూవీ ని తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేయనున్నాడు చిదంబరం.వీరి కాంబినేషన్ లో సినిమా దాదాపు ఫిక్స్ అయ్యినట్లే. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ధనుష్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్నాడు. ప్రస్తుతం ఈహీరో కుబేర తోపాటు రాయన్ ,నీక్ అనే సినిమాలు చేస్తున్నాడు.ఇవి కాకుండా ఇళయరాజా బయోపిక్ కూడా లైన్లో వుంది.దీని తరువాత అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తో ధనుష్ ఓ సినిమా చేయాల్సి వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























