లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ను ఇచ్చారు. మే 22వ తేదీన ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమాను జులై రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే డేట్ ను మాత్రం ప్రకటించలేదు. తాజాగా డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ తెలిపారు. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vanakkam INDIA! 🇮🇳 The 1st single from INDIAN-2 in Rockstar ANIRUDH musical is dropping on May 22nd! 🥁 Get ready to welcome the comeback of SENAPATHY! 🤞🏻 Releasing worldwide in cinemas 12th July 2024! 🎬🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/9xcsaDTVf5
— Lyca Productions (@LycaProductions) May 19, 2024
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























