మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా… రెండు భాగాలుగా `యన్.టి.ఆర్` బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం `యన్.టి.ఆర్. కథానాయకుడు` సంక్రాంతి కానుకగా విడుదలై నందమూరి అభిమానులను అలరించింది. ఇక రెండో భాగం `యన్.టి.ఆర్. మహానాయకుడు` ఫిబ్రవరి ప్రథమార్ధంలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. యన్టీఆర్ పాత్రధారి నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ పాత్రధారి కళ్యాణ్ రామ్‌తో పాటు వేలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య రథయాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ నెల 22తో ఈ సన్నివేశాల తాలూకు చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, సుమంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=Kxgd_bKQgfQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: