`పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్న గోపీచంద్… తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా… అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయంపై రకరకాల కథనాలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… ఓ బాలీవుడ్ బ్యూటీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని తెలిసింది. ఆమె మరెవరో కాదు… సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `వీర్` (2010)తో కథానాయికగా పరిచయమైన జరీన్ ఖాన్. `హౌస్‌ఫుల్ 2`, `హేట్ స్టోరీ 3` చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జరీన్… గోపీచంద్, తిరు చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. నటనకు అవకాశమున్న పాత్ర కావడంతో… జరీన్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. త్వరలోనే జరీన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=9jOVc1hBOEE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: