ట్రెండింగ్ లో భరత్ అనే నేను మూవీ సీన్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Bharat Ane Nenu Movie Scene Trending In Media, Bharat Ane Nenu Movie, Bharat Ane Nenu Movie Latest News, Mahesh babu Starrer Bharat Ane Nenu Movie Scene Trending, Mahesh Babu Bharat Ane Nenu Trending, Heavy Fines for Traffic violations Like Bharat Ane Nenu Movie Scene

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడకుండా భారత దేశ ప్రభుత్వం భారీ జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ గుర్తింపు పేపర్స్, అతి వేగం, ఓవర్ లోడ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారికి భారీ జరిమానాలు విధించమని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను మూవీ 2018 వ సంవత్సరం ఏప్రిల్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లోని ఒక సీన్ లో ట్రాఫిక్ ఉల్లంఘనులకు భారీ జరిమానాలు విధించమని ముఖ్య మంత్రి మహేష్ బాబు అధికారులకు ఆదేశాలు జారీచేస్తారు. భరత్ అనే నేను మూవీ చూసి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ రూపొందించాయని మహేష్ బాబు అభిమానుల వాదన. భరత్ అనే నేను మూవీ సీన్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here