‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రెండో షెడ్యూల్ ను ఈ నెల 26 నుండి ప్రారంభించనున్నారు. రాజమండ్రి, తణుకు పరిసర ప్రాంతాల్లో జరగనున్న ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో, నవంబర్‌లో చిక్‌మంగళూర్‌ల్లో జరిగే షూటింగ్స్‌తో చిత్రం పూర్తవుతుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటికే సంక్రాంతి పోరు భారీగా ఉండగా.. ఈ సంక్రాంతి బరిలోనే దిగాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరగా కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి వస్తున్న భారీ సినిమాలను కళ్యాణ్ రామ్ తట్టుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ కథానాయికగా నటిస్తుంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: