పూరి `జ‌న గ‌ణ మ‌న‌`లో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌!?

2019 Latest Telugu Movie News, Puri Jagannadh To Direct Janaganamana With Vijay Deverakonda, Janaganamana To Be Directed By Puri Jagannadh, Director Puri Jagannadh Next Movie Janaganamana,Vijay Deverakonda Next Janaganamana, Vijay Deverakonda Next Project Janaganamana By Puri Jagannadh, Janaganamana Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Puri Jagannadh To Direct Janaganamana With Vijay Deverakonda

చాలా కాలంగా విజయాలకు దూరమైపోయిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌… తాజా చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న పూరి… రెండు నెలలు విశ్రాంతి తీసుకుని ఆ తరువాతే తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ‘జన గణ మన’ తెర‌కెక్క‌నుంద‌ని… పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవ‌కాశ‌ముంద‌ని ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే గ‌నుక నిజ‌మైతే… పూరి మార్క్ హీరోయిజంతో విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త్వ‌ర‌లోనే పూరి, విజ‌య్ కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే… విజయ్ దేవ‌ర‌కొండ నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రోవైపు క్రాంతి మాధ‌వ్ చిత్రంతో పాటు మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీ `హీరో`తోనూ విజ‌య్ బిజీగా ఉన్నాడు.

[subscribe]

[youtube_video videoid=bONUwDO7i-0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =