రాజ్ దూత్ మూవీ రివ్యూ : రాజ్ దూత్ పై వచ్చిన రియల్ స్టార్ శ్రీహరి తనయుడు పాసయ్యాడు

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Rajdooth Movie Public Talk, Rajdooth Movie Review, Rajdooth Movie Review And Ratings, Rajdooth Movie Story, Rajdooth Review, Rajdooth Telugu Movie Live Updates, Rajdooth Telugu Movie Public Response, Rajdooth Telugu Movie Review, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Rajdooth Movie Review
రెండు దశాబ్దాల పాటు విలన్ గా,కామెడీ విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా విభిన్న పాత్రలు  పోషించి ఆ తరువాత హీరోగా ఎదిగి తన విలక్షణ, విశిష్ట అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుని అర్ధాంతరంగా అంతర్ధానమైన విశిష్ట నటుడు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన ఆకస్మిక మరణం తరువాత స్తబ్దత ఆవరించిన ఆ ఇంటి నుండి ఆరేళ్ల తరువాత మరలా ఒక సందడి మొదలైంది… ఆయన చిన్న కుమారుడు “మేఘాంశ్” హీరోగా నటించిన “రాజ్ దూత్” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీహరి కొడుకు నటించిన తొలి చిత్రం అనగానే ఏర్పడే సహజమైన అంచనాల నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో…. శ్రీహరి కొడుకు ఎలా ఉన్నాడో…. ఎలా చేసాడో.. రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ సినిమా విషయంలో అభినందించాల్సిన విషయం ఏమిటంటే… ఎలాంటి యాక్షన్ సన్నివేశాన్నైనా డూప్స్ తో పనిలేకుండా అత్యంత సాహసోపేతంగా స్వయంగా చేసి రియల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న శ్రీహరి కొడుకు హీరో కాబట్టి ఆ ఇమేజ్ ని అడ్డదిడ్డంగా వాడేసుకుందాం అనే కమర్షియల్ మైండ్ సెట్ తో కాకుండా క్యారెక్టర్ ను క్యారెక్టర్ గా ప్రజెంట్ చేద్దాం అని దర్శక నిర్మాతలు కమిట్ అవ్వడం. అలాగే శ్రీహరి కొడుకును  కాబట్టి నాకు ఇన్ని ఫైట్స్ కావాలి, ఇన్ని చేజ్ లు కావాలి, ఇన్ని డాన్స్ లు కావాలి అని డిమాండ్స్ డిక్టేట్ చేయకుండా కథను కథగా, క్యారెక్టర్ ను క్యారెక్టర్ గా ప్రజెంట్ చేయడానికి సహకరించినందుకు మేఘాంశ్ ను అభినందించాలి. ఇక కథాంశం విషయంలోకి వెళ్తే-  సంజయ్ (మేఘాంశ్) ప్రియా (ప్రియాంక వర్మ) సినిమా ఓపెనింగ్ టైం కే ప్రేమలో ఉంటారు. ప్రియా తండ్రి( అనీష్ కురువిల్లా) నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటే … అంటూ  కొన్ని టెస్టులు పెడుతుంటాడు. వాటిల్లో సంజయ్ ఫెలవుతుంటాడు. చివరకు ఒక టెస్ట్ పెడతాడు. మనుషుల పట్ల మనుషులకే కాదు… మనుషులకు  యంత్రాలకు, వస్తువులకు మధ్య కూడా అనుబంధాలు ఉంటాయి అని నిరూపించే ఒక విలక్షణమైన పరీక్ష అది. అందులో పాస్ అయితే నా కూతురిని ఇచ్చి నిరభ్యంతరంగా పెళ్లి చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఇంతకూ ఆ పరీక్ష ఏమిటి అంటే…. “ఇరవై ఏళ్ల క్రితం మా అన్నదమ్ములం ఆస్తి పంపకాలు చేసుకుని విడిపోయేటప్పుడు మా నాన్న అపురూపంగా చూసుకునే “రాజ్ దూత్” మోటర్ బైక్ మా తమ్ముడు దగ్గరే ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా కోమాలో ఉన్న మా నాన్న  ఇప్పుడు స్పృహలోకి వస్తున్నాడు. ఆయన స్పృహలోకి వచ్చే సమయానికి ఆయనకు ఇష్టమైన దేదైనా కళ్ల ముందు ఉంచగలిగితే మంచిదని డాక్టర్లు చెప్పారు… నువ్వు  రెండు రోజుల్లో ఆ రాజ్ దూత్ బైక్ తెస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను… అంటాడు. అప్పుడు రాజ్ దూత్ బైక్ తేవడం కోసం బయలుదేరిన సంజయ్, అతని మిత్రుడు సుదర్శన్ కు ఎదురైనా చిత్ర విచిత్ర వ్యక్తులు, అనుభవాల సమాహారమే రాజ్ దూత్ కథాంశం. మొత్తానికి రాజ్ దూత్ తీసుకురావటం వరకే పరిమితం కాకుండా ఆ క్రమంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కోవడం, కొందరి మనసులను గెలుచుకోవడం, అనుబంధాల విలువలను తెలియజెప్పటం వంటి మెలోడ్రామాతో  పాటూ అవకాశమున్న ప్రతిచోటా హాస్యాన్ని పండించడానికి ప్రయత్నించారు ఈ చిత్ర సంయుక్త దర్శకులు అర్జున్ – కార్తీక్. సాధారణంగా సంగీతం, సంభాషణల రచనలో మాత్రమే జంట సంగీత దర్శకులను, జంట రచయితలను చూస్తుంటాం. కానీ దర్శకత్వంలో జంట దర్శకులను చూడటం చాలా అరుదు. అలాంటిది ఈ చిత్రానికి ఇద్దరు యువ దర్శకులు అర్జున్ – కార్తీక్ సంయుక్త దర్శకత్వం వహించడం విశేషం. కథా పరంగా వీరిద్దరూ తీసుకున్న పాయింట్ లో మంచి నావేల్టీ ఉంది. అయితే ప్రజెంటేషన్లో మరికొంత మెచ్యూరిటీ అవసరం అనిపించింది.  మొత్తం మీద ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ఇవ్వటం కోసం చేసిన సిన్సియర్ ప్రయత్నం కనిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే: రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు హీరో కావటంతో ఏర్పడిన అంచనాలకు తగిన స్థాయిలో మేఘాంశ్ పర్ఫార్మెన్స్, అప్పియరెన్స్ ఉండటం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. తొలి చిత్రంలోనే విపరీతమైన యాక్షన్ ఇమేజ్ కోసం , ఓవర్ బిల్డప్ కోసం ప్రాకులాడకుండా boy at the next door లాగా కనిపించడం కోసం ప్రయత్నించిన మేఘామ్స్ అవగాహనను అభినందించాలి. ఇక ఇందులో యాక్టింగ్ పరంగా అవకాశం ఉన్న మరో రెండు క్యారెక్టర్లు హీరో ఫ్రెండ్ గా చేసిన ప్రజెంట్ ట్రెండింగ్ కమెడియన్ సుదర్శన్, రాజన్న కారెక్టర్ చేసిన ఆదిత్య మీనన్. హీరోయిన్లవి పెద్ద అంత ప్రాముఖ్యత లేని క్యారెక్టర్లే. మిగిలిన వన్నీ వచ్చిపోయే పాత్రలే. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి Up to the mark అనదగిన సహకారం లభించిన ఈ సినిమాను నూతన నిర్మాత ఎమ్.ఎల్ .వి సత్యనారాయణ (సత్తిబాబు) మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించడం అభినందనీయం. ఒక మంచి సినిమా నిర్మించాలి అన్న తపన తప్ప లాభనష్టాల బేరీజులు వేసుకునే తత్వం లేని ‘సత్తిబాబు’ లాంటి సొంత సత్తా కలిగిన నిర్మాతలకు విజయాలు చేకూరినప్పుడే చిత్ర పరిశ్రమ కళకళలాడుతుంది.
రాజ్ దూత్ మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3.5
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here