‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కథానాయకుడు నాగశౌర్య – దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ మూవీ ‘కళ్యాణ వైభోగమే’ తరువాత నాగశౌర్యకి జోడీగా మాళవికా నాయర్ నటిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య ఏడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో కనిపిస్తాడట. అంతేకాదు, ఈ ఏడు గెటప్స్ సినిమాకి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిత్రీకరణ విషయానికి వస్తే… ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన మూడో షెడ్యూల్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. ఆపై చకచకా చిత్రీకరణ జరిపి… ఈ సంవత్సరాంతంలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
[subscribe]
[youtube_video videoid=VGvvobnQHVY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: