నిహారిక పెళ్లిపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nagababu Opens Up About Niharika Marriage,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Nagababu About Niharika Marriage,Niharika Konidela Marriage News,Nagababu About Her Daughter Wedding,Naga Babu Comments on Niharika Marriage
Nagababu Opens Up About Niharika Marriage

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల తన వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. పలు విషయాలపై ఆయన స్పందిస్తూ… వాటికి కౌంటర్ గా వీడియోలు తీస్తూ పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు పలు విషయాలపై మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది కూడా నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి గురించి.

తాను మొదట నటించాలని ఉందని చెప్పినప్పుడు ఇంట్లో చాలా డిస్కషన్ జరిగింది… తనకు నటించాలని చాలా ఇంట్రెస్ట్ ఉండటంతో నేను అందుకు పర్మిషన్ ఇచ్చాను… అయితే తనకు అప్పుడే చెప్పాను మరో మూడు సంవత్సరాలలో పెళ్లి చేసేస్తానని.. 2018 వరకూ టైం ఇచ్చా.. అందుకు తను కూడా ఒప్పుకుందని చెప్పారు. ప్రస్తుతం నిహారికను మంచి వరుడిని వెతుకుతున్నాను… మంచి సంబంధం వస్తే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. మంచి వ్యక్తి, తన కాళ్లపై తాను నిలబడే వాడైతే చాలని పెళ్లికొడుకు ఎలా ఉండాలో చెప్పారు.

అంతేకాదు. తన కాపు కులాన్ని గౌరవిస్తానని, వచ్చే అబ్బాయి కూడా అన్ని కులాలను గౌరవించాలని.. తమ కులంలో మంచి అబ్బాయి దొరికితే మంచిదే.. లేదంటే వేరే కమ్యూనిటీకి చెందిన అబ్బాయి అయినా పర్వాలేదు.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. అలా అయితే ఇంకా హ్యాపీ అని.. తనకు కులంతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి దీన్నిబట్టి చూస్తుంటే నిహారికకు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిహారికను చేసుకోబోయే ఆ వరుడు ఎవరో చూద్దాం..!

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here