ట్యాగ్ · 265 కథనాలు · పేజీ 13
హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!
'మిడిల్ క్లాస్ ఫౌండేషన్' ద్వారా విజయ్ సాయం..!
హైదరాబాద్ లో "ఫైటర్ " మూవీ షూటింగ్ ?
‘ఫైటర్’ స్టోరీ లైన్ అదేనా?
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
అవసరమైతే 'అమ్మ' చున్నీ వాడండి...!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ?

ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నటించాలని ఉంది..!

హిందీ బాట పడుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్`?

'పలాస' డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!

#VD10 మూవీ లో భారీ క్లైమాక్స్ ఫైట్

40 డేస్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న #VD10

VD 10 మూవీ లో విజయ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్

నిర్మాతల హీరో
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'
ఇంద్రగంటి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్‌లో సినిమా రానుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్.
హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!
డాక్టర్ ను అవ్వబోయి యాక్టర్ ను అయ్యాను ఈ డైలాగ్ ఇప్పటికి చాలా సార్లే వినుంటాం. మన టాలీవుడ్ లో చాలా మంది హీరో, హీరోయిన్ లు, డైరెక్టర్ లు, నిర్మాతలు ఇలా చాలా పెద్ద చదువులు చదివిన వాళ్లే వున్నారు. వాళ్ళల్లో కొంత మంది సినిమా మీద ప్రేమతో పెద్ద ఉద్యోగాలు సైతం వదులుకొని రాగా.. కొంతమంది మాత్రం అనుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా వున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా సినిమా మీద ప్రేమతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. చిన్న పాత్రలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చేసి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి విజయ్ ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు.
'మిడిల్ క్లాస్ ఫౌండేషన్' ద్వారా విజయ్ సాయం..!
కరోనా వ్యాధి అరికట్టేందుకు గానూ ప్రభుత్వాలు తమ ప్రయత్నాలు తాము చేస్తుండగా... మరో పక్క సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల వరకూ ఎవరికి తోచింది వారు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొంత మంది పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటే.. కొంత మంది నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కొంతమంది అన్నం వండి పేదలకు పెడుతున్నారు.
హైదరాబాద్ లో "ఫైటర్ " మూవీ షూటింగ్ ?
పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. ఈ పాన్ ఇండియా మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు.
‘ఫైటర్’ స్టోరీ లైన్ అదేనా?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు విజయ్. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమికను పోషించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. ‘ఫైటర్’ స్టోరీ లైన్‌కు సంబంధించి ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వచ్చింది.
అల్లు అర్జున్ 'నో' అన్నాడు... విజయ్ 'ఎస్' అన్నాడు..!
ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాలను మరో హీరో ఓకే చేయడం అన్న సంగతి పాతతరం నుండి వస్తున్న ఆనవాయితీనే. ఒక్కోసారి అవి బోల్తా కొట్టొచ్చు.. ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టొచ్చు. అలాంటి అంశాలను కూడా మనం చాలానే చూసాం. ఇక ఇప్పుడు ఈ టాపిక్ గురించి చర్చ ఎందుకంటే... ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైటర్ సినిమా కూడా మొదట విజయ్ ను అనుకోలేదట పూరీ జగన్నాథ్.
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా - విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి కారణంగా జన జీవనం కష్టాలపాలయింది. ప్రజల ప్రాణ రక్షణ కై తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య బృందాలు, పోలీస్ శాఖ కు కృతజ్ఞతలు తెలపాల్సిందే. పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో హీరో విజయ్ దేవరకొండ కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధాన మిచ్చారు.

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
వరుస పెట్టి అందరూ పోలీసులపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు తో మొదలైన ఈ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు, తర్వాత చిరు.. ఆ తర్వాత వెంకీ.. ఇప్పుడు యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అయితే విజయ్ మాత్రం డైరెక్ట్ గా తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి.. పోలీసులను ప్రశంసించాడు. పోలీసులు రియల్ హీరోస్ అంటూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు…
అవసరమైతే 'అమ్మ' చున్నీ వాడండి...!
అవసరమైతే అమ్మ చున్నీ వాడండి అని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టించేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉండి కరోనాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా తమ సూచనలను ఇస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు జాగ్రత్తలు చెప్పగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సూచనలు చెబుతున్నాడు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ?
దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నటించాలని ఉంది..!
రౌడీ హీరో, ఆటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్, యూత్ ఐకాన్, మోస్ట్ డిజైరబుల్ మెన్ ఒక్క పేరు కాదు ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది. ఎవరో కాదు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంటరెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు…

హిందీ బాట పడుతున్న `వరల్డ్ ఫేమస్ లవర్`?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మూడు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం `వరల్డ్ ఫేమస్ లవర్`. సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ రూపొందించిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లి లిటే నాయికలుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించింది. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం... కంటెంట్ విషయంలో ఓకే అనిపించుకున్నా, ఎగ్జిక్యూషన్ విషయంలో పూర్ మార్క్స్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందీ సినిమా.

'పలాస' డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!
వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పలాస 1978' తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు కిరణ్ కుమార్. ఈ నెల 6 న విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను చాలా న్యాచురల్ గా చిత్రీకరించిన విధానానికి చాలా మంది ఫిదా అయ్యారు.

#VD10 మూవీ లో భారీ క్లైమాక్స్ ఫైట్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ #VD10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ ఫైటర్ గా నటిస్తున్న ఈ మూవీ లో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ ఈమూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

40 డేస్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న #VD10
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ #VD10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో క్యారెక్టర్ కై విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ థాయ్ ల్యాండ్ లో పొందారు. విజయ్ న్యూ ఇమేజ్ మేకోవర్, అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేయనున్నాయని సమాచారం.

VD 10 మూవీ లో విజయ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై హిందీ, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ మూవీ లో సూపర్ హిట్ మూవీస్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "పతి పత్ని ఔర్ వో " ఫేమ్ అనన్య పాండే కథానాయిక.

నిర్మాతల హీరో
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ "గీత గోవిందం" మూవీ తో స్టార్ హీరోగా మారారు. విజయ్ హీరోగా నటించిన "నోటా ", "డియర్ కామ్రేడ్ " మూవీస్ పరాజయం పొందినా విజయ్ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) తో బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో అప్పుడే అమ్మడు మన యంగ్ హీరోపై ప్రశంసలు కురిపించేస్తుంది.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'
ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి…