
ట్యాగ్ · 186 కథనాలు · పేజీ 4


ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్‌డేట్


అనిల్ షూట్ లో జాయిన్ అయిన వెంకీ మామ

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న వెంకటేష్

విదేశాల్లో సైంధవ్ టీమ్

సైంధవ్ లో తమిళ హీరో

ఫుల్ స్వింగ్ లో సైంధవ్- సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

ఓరి దేవుడా..! టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

సైంధవ్ లో మల్టీ టాలెంటెడ్ నటి

రానా నాయుడు 2కూడా రానుంది

వెంకీ సైంధవ్ లో నాని

కన్ఫామ్ సైంధవ్ లో జెర్సీ హీరోయిన్

వెంకటేష్, రానా ఉదారం.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు గడచిన మూడు రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.

ఘనంగా నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలు
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్‌డేట్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో SVC58గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

చిరంజీవి బర్త్ డే.. విషెస్ తెలిపిన వెంకటేష్, ఎన్టీఆర్, నాని సహా పలువురు హీరోలు
మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో విక్టరీ వెంకటేష్, నాగార్జున అక్కినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ మేకా, యంగ్ హీరోలు నితిన్, కార్తికేయ, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, సుశాంత్.. దర్శకులు బాబీ, హను రాఘవపూడి, మారుతి, బీవీఎస్ రవి తదితరులు ఉన్నారు. అలాగే చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కూడా తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపారు.

అనిల్ షూట్ లో జాయిన్ అయిన వెంకీ మామ
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఈసినిమాను రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా.

వెంకీ, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షూట్ ప్రారంభం
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్
విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.రెండు రోజుల క్రితం లాంఛ్ కూడా అయ్యింది.ఈ నెల మూడో వారం నుండి షూటింగ్ కూడా మొదలుకానుంది.నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు.ఇక ఈసినిమా లో మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పందించాడు అనిల్ రావిపూడి.ఇందులో వెంకటేష్ గారు ఒక్కరే హీరో మరో హీరో లేడు.ఇది ఎఫ్ 4 కాదు వేరే జోనర్ లో రానుంది.వచ్చే సంక్రాంతి కి విడుదలకానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరి వెంకీ ,అనిల్…

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న వెంకటేష్
సైంధవ్ తరువాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.ఈసినిమా వచ్చే నెల మొదటి వారం లో లాంచ్ కానుందని సమాచారం.ఆవెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారట.రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది.వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది.లాంచింగ్ రోజు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.ఇక ఇంతకుముందు వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.మరి ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.మరోవైపు ఈసినిమా విజయం సాధించడం వెంకటేష్ కు తప్పనిసరి కానుంది.

'సీతమ్మ వాకిట్లో' సీక్వెల్.. శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే..?
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన గొప్ప మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలైన వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులో వచ్చిన మల్టీ స్టారర్ చిత్రం కావడం ఒక విశేషమైతే.. ఇందులో వెంకటేష్, మహేష్ సోదరులుగా నటించడం మరో విశేషం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలకు పేర్లు లేకపోవడం ఆశ్చర్యకర విషయం. సినిమా ఆసాంతం వీరిని పెద్దోడు, చిన్నోడు అనే ట్రీట్ చేయడం గమనార్హం. ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తుంటే.. ప్రేక్షకులు అలా చూస్తుండిపోతారు. మంచి కుటుంబ…

విదేశాల్లో సైంధవ్ టీమ్
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, అలానే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంకా ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.

సైంధవ్ లో తమిళ హీరో
ఎఫ్ 3 తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్. ఇది ఆయనకు 75వ సినిమా కావడం విశేషం.హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య ఓ కీలక మైన పాత్రలో మానస్ అనే పేరు తో కనిపించనున్నాడు.కొద్దిసేపటి క్రితం ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో లాంగ్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని కనిపించాడు ఆర్య.ఈ ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.

హార్ట్ ఆఫ్ సైంధవ్- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు కేవలం సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాకుండాా ఓటీటీలో కూడా చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

ఫుల్ స్వింగ్ లో సైంధవ్- సెకండ్ షెడ్యూల్ కంప్లీట్
విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్1, హిట్ 2 సినిమాలతో మంచి విజయాలను అందుకున్న శైలేష్ కోలను దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అందులోనూ ఈసినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాాలా కాలం అవుతుంది. ఈసినిమా మొదట్లో అప్ డేట్లు ఇస్తూ వచ్చారు. అయితే ఈమధ్య ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. దీంతో ఈసినిమా విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఇన్ని రోజుల తర్వాత ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో…

ఓరి దేవుడా..! టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్
విశ్వక్ సేన్,మిథాలీ పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా..!కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవలే కు ఇది రీమేక్. ఈసినిమా తెలుగులోకూడా డీసెంట్ హిట్ అనిపించుకుంది.స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించగా రాహుల్ రామకృష్ణ,ఆశా భట్,మౌనిక రెడ్డి,వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో నటించారు.ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తే ఓరి దేవుడా..!ను డైరెక్ట్ చేశాడు.లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.పీవీపీ ఈసినిమాను నిర్మించారు.ఇక ఈసినిమాటీవీ లో టెలికాస్ట్ కానుంది.వరల్డ్ ప్రీమియర్ మూవీ గా జెమినీ టీవీలో ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు రానుంది.

సైంధవ్ లో మల్టీ టాలెంటెడ్ నటి
విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా సైంధవ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న చిత్రయూనిట్ రెండో షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్లను ప్రకటించారు మేకర్స్. టాలెంటెడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ప్రకటించారు. శ్రద్ధ శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో అలానే రుహానీ సింగ్ డా.రేణు పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో హీరోయిన్ కు…

సైంధవ్ నుండి మరో హీరోయిన్ రోల్ రివీల్
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో శైలేష్ కొలను ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే వార్తులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్, రుహానీ శర్మ హీయిన్లుగా నటిస్తున్నారని అన్నారు. రీసెంట్ గానే శ్రద్థ శ్రీనాథ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసారు. ఈసినిమాలో శ్రద్ధ మనోజ్ఞ అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా రుహానీ శర్మ కూడా…

భారీ స్థాయిలో విడుదలవుతున్న కిసీకా బాయ్ కిసీకీ జాన్
సల్మాన్ ఖాన్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం కిసీకా బాయ్ కిసీకీ జాన్.ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన సాంగ్స్ కి సల్మాన్ వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.రేపు ఈసినిమా విడుదలవుతుంది.ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో రికార్డు క్రీయేట్ చేసింది.ఇండియాలో ఈసినిమా 4500 స్క్రీన్ లలో విడుదలకానుంది.ఆలెక్కన తొలి రోజు16000షోస్ పడనున్నాయి.అలాగే మిగితా దేశాల్లో మరో 1200స్క్రీన్ లలో విడుదలకానుంది.హిందీలో భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా ఇదే.దాంతో మొదటి రోజు ఈసినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

రానా నాయుడు 2కూడా రానుంది
వెంకటేష్,రానా మొదటి సారి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.హిందీ,తెలుగు భాషల్లో గత మార్చి 10నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా మూడు వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. సుపర్ణ్ వర్మ ,కరుణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో సుర్లీన్ చావ్లా,ఆదిత్య మీనన్,ప్రియా బెనర్జీ,అశీష్ విద్యార్ధి కీలకపాత్రల్లో నటించారు. మొదటి సీజన్ మొత్తం 10ఎపిసోడ్ల తో తెరకెక్కగా సంగీత్ -సిద్దార్థ్ సంగీతం అందించారు. ఇక సీజన్ 1 హిట్ కావడంతో రానా నాయుడు సీజన్ 2 రానుందని నెట్ ఫ్లిక్స్ ఆఫీషియల్ గా ప్రకటించింది. అందుకు సంబంధించి ఓ గ్లిమ్ప్స్ ను కూడా…

వెంకీ సైంధవ్ లో నాని
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ 1,హిట్ 2 సిరీస్ తో హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ప్రస్తుతం. ప్రస్తుతం అయితే తను విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకొని వెంటనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.

కన్ఫామ్ సైంధవ్ లో జెర్సీ హీరోయిన్
హిట్ సిరీస్ తో విజయాలు అందుకున్న శైలేష్ కొలను తన తరువాత సినిమాను అగ్రహీరో వెంకటేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. సైంధవ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమాాా ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది కూడా. సెకండ్ షెడ్యూల్ ను రీసెంట్ గానే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ వెజాగ్ లో జరుగుతుంది.