విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఈసినిమాను రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలోని పొల్లాచిలో ఈసినిమా షూటింగ్ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్‌లో వెంకటేష్ జాయిన్ అయిన సందర్భంగా మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో వెంకీ సెట్స్ లోకి రావడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
కాగా ఈసినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు. మరి ఈసినిమాతో వెంకీ ,అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: