ఓరి దేవుడా..! టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ 

Ori Devuda World Television Premiere Date Locked

విశ్వక్ సేన్,మిథాలీ పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా..!కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవలే కు ఇది రీమేక్. ఈసినిమా తెలుగులోకూడా డీసెంట్ హిట్ అనిపించుకుంది.స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించగా రాహుల్ రామకృష్ణ,ఆశా భట్,మౌనిక రెడ్డి,వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో నటించారు.ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తే ఓరి దేవుడా..!ను డైరెక్ట్ చేశాడు.లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.పీవీపీ ఈసినిమాను నిర్మించారు.ఇక ఈసినిమాటీవీ లో టెలికాస్ట్ కానుంది.వరల్డ్ ప్రీమియర్ మూవీ గా జెమినీ టీవీలో ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉంటే రీసెంట్ గా దాస్ కా ధమ్కీ తో సాలిడ్ హిట్ కొట్టాడు విశ్వక్ సేన్.విశ్వక్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమాను విశ్వక్ సేనే డైరెక్ట్ చేసాడు.ప్రస్తుతం విశ్వక్ తన 10వచిత్రంలో నటిస్తున్నాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక విశ్వక్ తన 11వసినిమాను కృష్ణ చైతన్య డైరెక్షన్లో చేయనున్నాడు.ఇటీవలే ఈసినిమా అఫీషియల్ గా లాంచ్ అయ్యింది.మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈసినిమాలో విశ్వక్ నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడు. ఈసినిమా గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 1 =