రానా నాయుడు 2కూడా రానుంది 

Rana Naidu season 2 is coming soon

వెంకటేష్,రానా మొదటి సారి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.హిందీ,తెలుగు భాషల్లో గత మార్చి 10నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా మూడు వారాల పాటు ట్రెండింగ్ లో కొనసాగింది. సుపర్ణ్ వర్మ ,కరుణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో సుర్లీన్ చావ్లా,ఆదిత్య మీనన్,ప్రియా బెనర్జీ,అశీష్ విద్యార్ధి కీలకపాత్రల్లో నటించారు. మొదటి సీజన్ మొత్తం 10ఎపిసోడ్ల తో తెరకెక్కగా సంగీత్ -సిద్దార్థ్ సంగీతం అందించారు. ఇక సీజన్ 1 హిట్ కావడంతో రానా నాయుడు సీజన్ 2  రానుందని నెట్ ఫ్లిక్స్ ఆఫీషియల్ గా ప్రకటించింది. అందుకు సంబంధించి ఓ గ్లిమ్ప్స్ ను కూడా రిలీజ్ చేసింది. మరి ఈ రెండో సీజన్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే వెంకటేష్ ప్రస్తుతం హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్ లో నటిస్తున్నాడు.సైంధవ్ అనే టైటిల్ తో తెరెక్కుతున్న ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్,ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమా ఈ డిసెంబర్ 22న తెలుగుతోపాటు హిందీ,కన్నడ,తమిళ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.

ఇక రానా విషయానికి వస్తే తెలుగులో విరాటపర్వం తరువాత మరో సినిమాకు సైన్ చేయలేదు.ప్రస్తుతం రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ఒక్కటే రానా చేతిలో వున్న ప్రాజెక్ట్. ఇది కాకుండా మసూద ఫేమ్ తిరువీర్ లీడ్ రోల్ లో నటిస్తున్న పరేషాన్ అనే సినిమాకు రానా  సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =