టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో శైలేష్ కొలను ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే వార్తులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్, రుహానీ శర్మ హీయిన్లుగా నటిస్తున్నారని అన్నారు. రీసెంట్ గానే శ్రద్థ శ్రీనాథ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేసారు. ఈసినిమాలో శ్రద్ధ మనోజ్ఞ అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా రుహానీ శర్మ కూడా ఈసినిమాలో ఉందని కన్ఫామ్ చేస్తూ తన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. డాక్టర్ రేణు అనే పాత్రలో రుహానీ శర్మ కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
An incredibly skilled performer who mesmerises with her presence ❤️
Introducing @iRuhaniSharma as
Dr Renu from #SAINDHAV 💥#SaindhavOnDec22Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/7Jpxts37Oa
— Niharika Entertainment (@NiharikaEnt) April 21, 2023
కాగా సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా న్యాచురల్ స్టార్ నాని కూడా ఈసినిమాలో కనిపించనున్నాడన్న వార్తలు కూడా ఈమధ్య తెరపైకి వచ్చిన సంగతి విదితమే కదా. అయితే దీనిపై క్లారటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ ఏడాది డిసెంబర్ 22 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: