ఎఫ్ 3 తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్. ఇది ఆయనకు 75వ సినిమా కావడం విశేషం.హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య ఓ కీలక మైన పాత్రలో మానస్ అనే పేరు తో కనిపించనున్నాడు.కొద్దిసేపటి క్రితం ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో లాంగ్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని కనిపించాడు ఆర్య.ఈ ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
ఈసెప్టెంబర్ లో సైంధవ్ షూటింగ్ పూర్తి కానుంది.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈసినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ,శ్రద్దా శ్రీనాథ్,ఆండ్రియా జెర్మియా,రుహాణి శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైనెంట్స్ బ్యానర్ ఫై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు.డిసెంబర్ 22న సైంధవ్ పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఇక వెంకటేష్ కు ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ కానుంది.మరి ఈసినిమా వెంకీకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: