టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో SVC58గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం, పొల్లాచ్చిలోని కొన్ని అందమైన ప్రదేశాలలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్‌లపై ఒక అందమైన పాట చిత్రీకరిస్తున్నారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమ పాటల్లో ఇది ఒకటి కానుంది. భాస్కరభట్ల సాహిత్యాన్ని సమకూర్చగా, భీమ్స్ సిసిరోలియో చార్ట్‌బస్టర్ పాటను అందించారు. డ్యాన్స్ కొరియోగ్రఫీని భాను మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు.
ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ, ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, ‘బీస్ట్’ ఫేమ్ గణేష్ జనార్దనన్ తదితరులు నటిస్తున్నారు.
కాగా వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో, అందునా దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: