టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, నాని, మంచు విష్ణు, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, వంటి స్టార్ హీరోలు ఉన్నారు. అలాగే దర్శకులు కె, రాఘవేంద్రరావు, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, సీనియర్ హీరోయిన్స్ సుహాసిని, మాలశ్రీ పాల్గొన్నారు.
ఇంకా ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, నిర్మాతలు అశ్వినీదత్, మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు, ఇంకా సీనియర్ నటులు మురళీమోహన్, జయప్రద, ప్రభ, జయసుధ ఫ్యామిలీ, రాజశేఖర్ దంపతులతోపాటుగా రాజకీయనాయకులు టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు తదితరులు హాజరయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: