సైంధవ్ తరువాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.ఈసినిమా వచ్చే నెల మొదటి వారం లో లాంచ్ కానుందని సమాచారం.ఆవెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారట.రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది.వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది.లాంచింగ్ రోజు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.ఇక ఇంతకుముందు వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.మరి ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.మరోవైపు ఈసినిమా విజయం సాధించడం వెంకటేష్ కు తప్పనిసరి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సంక్రాంతికి సైంధవ్ తో వచ్చిన వెంకటేష్ కు ఆ సినిమా నిరాశను మిగిల్చింది.ఇది తనకు 75వ సినిమా కూడా.మంచి అంచనాలతో వచ్చిన ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.దాంతో తన 76వ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు.
ఇక ప్రస్తుతం వెంకటేష్ ,రానా నాయిడు సీజన్ 2 పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇందులో రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.త్వరలోనే రానా నాయుడు 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.దీనికి కొనసాగింపుగా సీజన్ 3 కూడా తెరకెక్కనుందట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: