కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Upcoming Movies

ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 6

Superstar Krishna garu is no more, Superstar Krishna Is A Trendsetter In Telugu Cinema, Trendsetter In Telugu Cinema, Ghattamaneni Siva Rama Krishna Murthy, first cinemascope film, first Eastmancolor film, first DTS film, 70mm film, owboy films and s
సినిమా వార్తలు

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన కృష్ణ తేనెమనసులు (1965) చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350 సినిమాలలో నటించిన కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందారు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు) వంటి రికార్డ్స్ ను కృష్ణ క్రియేట్ చేశారు. హీరో , నిర్మాత , దర్శకుడు , స్టూడియో…

Team TFNవాట్సాప్
Celebrities Mourn Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Celebrities Mourn, Krishnas Demise, Superstar Krishna Has Passed Away, Krishna Health Update, Krishna Health Latest Update, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రముఖుల సంతాపం

గత రెండేళ్ల నుండి ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలను కోల్పోయాం. ఇక రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో లెజెండరీ నటుడిని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ మరోసారి విషాదంలో మునిగిపోయింది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా కృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అంతేకాదు 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారు. ఇక ఈలోపే కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో అటు ఇండస్ట్రీతో పాటు…

TFN Adminవాట్సాప్
Hero Naga Shaurya Gets Hospitalized, Naga Shaurya Gets Hospitalized, Hero Naga Shaurya, Actor Naga Shaurya, Naga Shaurya, Naga Shaurya's 24th film, Naga Shaurya Latest Movie, Naga Shaurya's Upcoming Movie, SS Arunachalam, NS24, Naga Shaurya Health La
సినిమా వార్తలు

నాగశౌర్యకు అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు

ఈరోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నా.. పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటున్నారు వైద్యులు. ఇక ఈ వార్త నుండి ఇంకా తేరుకోకముందే మరో యంగ్ హీరో అస్వస్థతలకు గురయ్యారు. తాజాగా షూటింగ్ లో పాల్గొన్న నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. దీని కారణం నాగశౌర్య తన సినిమాలోకి పాత్ర కోసం గత 3 రోజులుగా డైట్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. దానివల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన…

TFN Adminవాట్సాప్
Hit 2 movie team hungama in Vizag, Hit 2 movie team hungama, Hit 2 movie team in Vizag, Hit 2 movie hungama, HIT: The Second Case, Hit 2 movie team, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie
సినిమా వార్తలు

వైజాగ్ లో HIT :ది సెకండ్ కేస్ మూవీ టీమ్ సందడి

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Masooda movie Trailer out now, Masooda Trailer Launched By Vijay Deverakonda, Vijay Deverakonda, Masooda Telugu Trailer, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Rahul Yadav Nakka, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer's Upcoming Movie, Masooda,
ట్రైలర్ & టీజర్

మసూద మూవీ ట్రైలర్ రిలీజ్

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన మసూద మూవీ18 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్, హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Picture from 80's Stars Reunion In Mumbai, 80's Stars Reunion In Mumbai, Picture from 80's Stars, 80's Stars Reunion, Rajinikanth, Kamal Haasan, Mohanlal, Chiranjeevi, Mega Star Chiranjeevi, R. Sarathkumar, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upc
సినిమా వార్తలు

ముంబై లో 80 ల నాటి నటీనటుల రీ యూనియన్

ఎనభైల నాటి తారలంతా ప్రతీ సంవత్సరం ఆత్మీయ కలయిక వేడుక జరుపుకోవాలనే కాన్సెప్ట్ ను సుహాసిని మణిరత్నం మొదలుపెట్టారు. అందుకు అనుగుణంగా 2009 నుంచి ఈ ఆత్మీయ కలయిక వేడుక నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ కలయిక చివరిసారిగా 2019 లో మెగాస్టార్ చిరంజీవి నివాసం వేదికగా జరిగింది. ఆ వేడుక లో రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ కూడా హాజరయ్యారు. తర్వాత కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో 2020, 21 లలో ఈ ఆత్మీయ కలయికకు సందర్భం రాలేదు.

Team TFNవాట్సాప్
Hidimba Movie shooting completed, Hidimba shooting completed, Hidimba Movie shooting, Ashwin Babu, Nandita Swetha, Anil Krishna Kanneganti, Ashwin Babu Latest Movie, Ashwin Babu's Upcoming Movie, Hidimba, Hidimba Movie, Hidimba Update, Hidimba New Up
షూటింగ్ అప్‌డేట్

హిడింబ మూవీ షూటింగ్ పూర్తి

సక్సెస్ ఫుల్ రాజు గారి గది 3 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ హిడింబ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నందిత శ్వేత కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Krishna health condition still critical, Superstar Krishnas Health Update, Superstar Krishna Health Update, Krishna Health Update, Krishna Health Latest Update, Krishna Health, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna,
సినిమా వార్తలు

విషమంగానే కృష్ణ ఆరోగ్యం

సూపర్ స్టార్ కృష్ణ నేడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా కృష్ణ బాధపడుతూనే ఉన్నారు. ఇక నేడు మరింత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కృష్ణ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మొదట కృష్ణ గారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్‌ డాక్టర్లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు చెప్పారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన గుండెపోటు నుంచి బయటపడేలా చేశామని.. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స…

TFN Adminవాట్సాప్
actor vishal about Laatti movie, vishal about Laatti movie, actor vishal, Vishal, Prabhu, Sunaina, A Vinoth Kumar, Vishal Latest Movie, Vishal's Upcoming Movie, Laatti, Laatti Movie, Laatti Update, Laatti New Update, Laatti Latest Update, Laatti Movi
సినిమా వార్తలు

కానిస్టేబుల్స్ అందరికీ లాఠీ అంకితం

తమిళ హీరో విశాల్ కు తెలుగులో ఎంత మంచి పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా లాఠీ. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి హైద‌రాబాద్‌లో ఈవెంట్ ను నిర్వహించారు.

TFN Adminవాట్సాప్
Actor Santosh Shobhan Write Emotional Letter To Fans, Shobhan Write Emotional Letter To Fans, Santosh Shobhan Emotional Letter, Actor Santosh Shobhan, Santosh Shobhan, Faria Abdullah, Merlapaka Gandhi, Santosh Shobhan latest movie, Santosh Shobhan's
సినిమా వార్తలు

సంతోష్ శోభన్ ఎమోషనల్ పోస్ట్

గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాకు ప్రేక్షకాదరణ లభించడంతో సంతోష్ శోభన్ తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.

TFN Adminవాట్సాప్
Kantara Movie Running Successfully In Theaters, Kantara Running Successfully In Theaters, Kantara A Divine Blockbuster, Kantara Collections, Rishab Shetty, Sapthami Gowda, Vijay Kiragandur, Rishab Shetty latest movie, Rishab Shetty's Upcoming movie,
సినిమా వార్తలు

థియేటర్స్ లో దిగ్విజయం గా ప్రదర్శింపబడుతున్న కాంతార

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
RRR Movie Sequel Interesting News, RRR Movie Interesting News, RRR Movie Sequel, RRR 2, SS Rajamouli's RRR, Ajay Devgn, NT Rama Rao Jr, Ram Charan, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR New Update, RRR Lat
సినిమా వార్తలు

ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Yashoda Movie Latest Collections In Overseas, Yashoda Latest Collections In Overseas, Yashoda Movie Overseas Collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sa
బాక్సాఫీస్

ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ సాధిస్తున్న యశోద

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
samanthas yashoda movie 3 days collections, yashoda movie 3 days collections, yashoda 3 days collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Haree
బాక్సాఫీస్

సమంత యశోదకు టెర్రిఫిక్ కలెక్షన్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన రూట్ మార్చిన సంగతి తెలిసిందే కదా. దశాబ్దానికి పైగా ఇక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించిన సామ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను ఏర్పరుచుకుంటుంది. అందుకే కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా అన్ని భాషలపై దృష్టి పెడుతుంది. అంతేకాదు గ్లామర్ పాత్రలను కాస్త పక్కనపెట్టి ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గా యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీ హరీష్ శంకర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సరోగసి లో జరిగే క్రైమ్ ల బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది.

TFN Adminవాట్సాప్
Superstar Krishnas Health Update, Superstar Krishna Health Update, Krishna Health Update, Krishna Health Latest Update, Krishna Health, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Ho
సినిమా వార్తలు

నిలకడగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం

సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం కాస్త అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ హీరో నరేష్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. అభిమానులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ కొంత కాలంగా మానసికంగా బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ముందు విజయ నిర్మల మరణం.. ఆ తరువాత తన పెద్ద కుమారుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడం.. రీసెంట్ తన మొదటి…

TFN Adminవాట్సాప్
Bimbisara Movie Hindi Version Streaming on ZEE5, Bimbisara Hindi Version Streaming on ZEE5, Bimbisara Movie Hindi Version, Bimbisara Hindi Version, Bimbisara Hindi, Bimbisara Streaming on ZEE5, ZEE5, Nandamuri Kalyan Ram, Prakash Raj, Kalyan Ram, Sam
ఓటీటీ

ప్రముఖ ఓటీటీ ZEE5 లో బింబిసార మూవీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఘనవిజయం సాధించి , భారీ వసూళ్ళు రాబట్టిన విషయం తెలిసిందే. బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.. బింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.మొదటి వారం లో బింబిసార మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Anushka Busy In London Shooting for her next, Anushka Busy In Shooting for her next, Anushka Busy In London, Anushka Shetty, Naveen Polishetty, Vinni Mobstaz, Mahesh Babu P, Anushka Shetty Latest Movie, Anushka Shetty's upcoming film, Anushka 48, Anu
షూటింగ్ అప్‌డేట్

లండన్‌లో బిజీ బిజీగా స్టార్ హీరోయిన్ అనుష్క

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క కథానాయికగా తెరకెక్కిన మిర్చి , భాగమతి మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ బ్యానర్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ లో అనుష్క నటిస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క, సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అనుష్క లండన్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ యూకేలో ఉంది. లండన్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సుమారు పది రోజులు లండన్‌లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. లండన్ సిటీతో పాటు శివార్లలో కీలక సన్నివేశాలు దర్శకుడు…

Team TFNవాట్సాప్
Waltair Veerayya Movie First Single Update, Waltair Veerayya Songs Update, Waltair Veerayya First Single Boss Party To Be Released This Week, Boss Party To Be Released This Week, Waltair Veerayya First Single, Boss Party, Boss Party Song, megastar Ch
సినిమా వార్తలు

వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nenu Student Sir Movie Teaser Released, Nenu Student Sir Telugu Movie Teaser Released, Nenu Student Sir Teaser, Nenu Student Sir Movie Teaser, Bellamkonda Ganesh, Avantika Dassani, Rakhi Uppalapati, Ganesh Latest Movie, Ganesh's Upcoming Movie, Nenu
ట్రైలర్ & టీజర్

నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్

మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా డీసెంట్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్ప‌ల‌పాటీ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను అప్పుడే స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Masooda Trailer out now, Masooda Telugu Trailer, Sangitha, Thiruveer, Kavya Kalyanram, Rahul Yadav Nakka, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer's Upcoming Movie, Masooda, Masooda 2022, Masooda Movie, Masooda Update, Masooda New Update, Masooda
ట్రైలర్ & టీజర్

విజయ్ దేవరకొండ విడుదల చేసిన మసూద ట్రైలర్

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్