
ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 5


వరుసగా 21 సంవత్సరాలు సంక్రాంతి మొనగాడుగా కృష్ణ

మెగాప్రిన్స్ కు జోడీగా మాజీ మిస్ వరల్డ్

63 దేశాలలో రిలీజ్ అయిన కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు

సీతారామం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ

కాంతార మరో లాంగ్వేజ్ లో?

సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ

రేపు సినిమాల షూటింగ్ లు బంద్

సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన

శంకర్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హాఫ్ మిలియన్ కి చేరువలో యశోద

45 సినిమాలలో జంటగా కృష్ణ , జయప్రద

సుమంత్ వారాహి మూవీ షూటింగ్ ప్రారంభం

కృష్ణ మృతిపై మోదీ ప్రగాఢ సంతాపం

ఒకే ఏడాది మూడు విషాదాలు

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్

100 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న ఆదిపురుష్ హిందీ టీజర్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు .హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్…

వరుసగా 21 సంవత్సరాలు సంక్రాంతి మొనగాడుగా కృష్ణ
తెలుగు సినిమాల రిలీజ్ కి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. సంక్రాంతి సెలవు లకి ప్రజలంతా తమ ఊరిలో , ఇంట్లోనే ఉండి బంధు , మిత్రులతో పండగ జరుపుకుంటారన్నది తెలిసిన విషయమే. అప్పట్లో సినిమాలకి గ్రామీణ స్థాయిలో ఆదరణ ఎక్కువగా ఉండేది. సంక్రాంతికి జనం చేతిలో డబ్బులు ఉంటాయి. సంక్రాంతి అనేది పల్లె పండగ . బంధువుల సందడి పెరిగే పండగ. అందరూ కలిసి తప్పకుండా సినిమాలకి వెళ్లేవారు. అందువలన సంక్రాంతి సినిమాకి వసూళ్లు ఒక రేంజ్ లో ఉండేవి.

మెగాప్రిన్స్ కు జోడీగా మాజీ మిస్ వరల్డ్
మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేయడంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పటివరకూ తనకు ఫ్లాప్స్ కంటే సక్సెస్ రేటే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గానే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ప్రస్తుతం అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించడం జరిగింది. అయితే రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్.

63 దేశాలలో రిలీజ్ అయిన కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ , విజయనిర్మల జంటగా కొన్ని హాలీవుడ్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో తెరకెక్కిన వెస్ట్రన్ యాక్షన్ కౌబాయ్ ఫిల్మ్ మోసగాళ్ళకు మోసగాడు 1971 ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.కృష్ణ కెరియర్ లో మైలురాయిగా నిలిచిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఇది మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

సీతారామం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ
హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథగా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం హిందీ భాషలలో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టెలివిజన్ లో కూడా సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈసినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అవుతుంది. మరి థియేటర్లలో అలానే ఓటీటీ లో…

కాంతార మరో లాంగ్వేజ్ లో?
ప్రస్తుతం సౌత్ సినిమాల హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా సౌత్ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ వద్ద తమ సత్తా చూపించాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా మరోసారి సౌత్ సినిమా స్థాయిని పెంచేసింది. కన్నడలో వచ్చిన ఈసినిమా ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ అవుతూ బ్లాక్ బస్టర్ అవుతూ దూసుకుపోతుంది. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో…

సూపర్ స్టార్ కృష్ణ ఒక అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా మెగా స్టార్ చిరంజీవి
టాలీవుడ్‌లో ఐదు దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తమిళనాడు, కర్ణాటకలోనూ ఉన్న 2500 అభిమాన సంఘాలలో ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ
టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి చేరిన కృష్ణ... చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , నాగ చైతన్య తదితరులు నటశేఖర్ కృష్ణ కి ఘన నివాళులర్పించారు, మహేష్ బాబును ఓదార్చుతూ ధైర్యం నింపారు.

రేపు సినిమాల షూటింగ్ లు బంద్
నిన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా పరిస్థితి కాస్త విషమంగానే ఉందని చెప్పారు. ఈలోపే నేడు తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వచ్చి మహేష్ కుటుంబానికి నివాళులర్పించారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన
కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు.సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.

స్పై జోనర్ చిత్రాలను టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరో కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు (1965) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. 5 దశాబ్దాలపాటు సుమారు 350 సినిమాలలో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించారు. సాహసాలకు , ప్రయోగాత్మక చిత్రాలకు హీరో కృష్ణ పెట్టింది పేరుగా మారారు. మైథలాజికల్, డ్రామా, వెస్టర్న్, ఫాంటసీ, యాక్షన్, స్పై జోనర్‌తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో హీరోగా నటించి కృష్ణ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.టాలీవుడ్ లో ఎంతమంది హీరోలున్నా అభిమానులు ఒక్క కృష్ణనే హీరో కృష్ణగా పిలవడం విశేషం.

శంకర్ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు.ఇక ఈసినిమాలో రామ్ చరణ్ పాత్రకు, నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన ఫోకస్ ను శంకర్ తో చేస్తున్న సినిమాపై పెట్టాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా రామ్ చరణ్ ఈసినిమాపై అలానే శంకర్ పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను శంకర్ గారికి అలానే తన మేకింగ్ కు 1992 నుండే పెద్ద ఫ్యాన్ ను.. అని ఆయనతో వర్క్ చెయ్యడం ఒక డ్రీం లాంటిది అని తాను తెలిపాడు. అంతేకాదు తాను కొత్త షెడ్యూల్ కోసం న్యూయార్క్ వెళుతున్నట్టు కూడా…

హాఫ్ మిలియన్ కి చేరువలో యశోద
హరి అండ్ హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా యశోద. సరోగసీ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం దూసుకుపోతుంది. నిజానికి ఇప్పటికే సమంత లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేసింది. అవి కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆమె నటించిన ఓ బేబి సినిమాలో తన నటనకు బాగా విమర్శకులు ప్రశంసలు సైతం దక్కాయి. దాంతో ఈసినిమాపై కూడా మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను ఏ మాత్రం నిరాశపరచలేదు సమంత. ఈసినిమాలో సమంత పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ వారం యశోద ఒక్కటే…

45 సినిమాలలో జంటగా కృష్ణ , జయప్రద
సూపర్’స్టార్ కృష్ణ తో 45 చిత్రాలలో జంటగా నటించి జయప్రద రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో ఒక హీరోయిన్ ఓ హీరోతో అన్ని చిత్రాల్లో నటించడం అసాధ్యం. ఆ క్రెడిట్ జయప్రదకే దక్కింది. బాపు దర్శకత్వంలో విజయా సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో కృష్ణ సరసన జయప్రద తొలిసారిగా నటించారు. తరువాత మనవూరి కథ సినిమాలో నటించారు. హీరో కృష్ణ , జయప్రద జంటగా తెరకెక్కిన ఈనాటి బంధం ఏ నాటిదో’ సినిమా ఘనవిజయం సాధించింది. దొంగలకు దొంగ మూవీ లో కృష్ణ, జయప్రద హుషారైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సుమంత్ వారాహి మూవీ షూటింగ్ ప్రారంభం
హీరో సుమంత్ , దర్శకుడు సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ లో వారాహి అమ్మవారి నేపథ్యంలో మరో డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది.

3 రోజులకు 20 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న యశోద
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

కృష్ణ మృతిపై మోదీ ప్రగాఢ సంతాపం
అలనాటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నేడు మరణించారు. దీంతో మహేష్ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక ఇప్పటికే కృష్ణ మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర నుండి అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. ఇక తాజాగా ప్రధానమంత్రి మోడీ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంతాపం తెలియచేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేష్ బాబుకు అలానే వారి…

ఒకే ఏడాది మూడు విషాదాలు
ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది మూడు విషాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మహేష్ తీవ్ర విషాదాన్ని మిగిల్చి మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి పద్మావతి కొద్ది రోజుల క్రిందటే మరణించారు. సెప్టెంబర్ లో ఆమె మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు మహేష్ బాబు. ఇంతలోనే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్
మొదటి తరం హీరోలు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు , కాంతారావు కాంబినేషన్ లో పలు సినిమాలలో నటించిన హీరో కృష్ణ , రెండవతరం హీరోలు శోభన్ బాబు , కృష్ణం రాజు కాంబినేషన్ లో నటించారు. మూడవతరం హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ నటించారు. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్
తెలుగు సినీ పరిశ్రమలో మహామహులకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ అసాధ్యుడిగా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆయన సాధించిన పలు రికార్డులు నేటికి చెక్కుచెదరలేదు.తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం కృష్ణ రికార్డులు శాశ్వతంగా నిలిచిపోతాయి.హీరోగా అత్యధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎక్కువ మంది దర్శకులతో పనిచేసిన ఏకైక హీరో కృష్ణనే యాభై ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 108 మంది దర్శకులతో కృష్ణ సినిమాలు చేశారు.