డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ సీక్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ .. తన చిత్రాలన్నింటికీ మా నాన్న(విజయేంద్రప్రసాద్ ) కథలు సమకూర్చుతారనీ , ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి ఇటీవల కొద్దిగా చర్చించామనీ , ఇప్పుడాయన ఆ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: