కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వైజాగ్ లో HIT :ది సెకండ్ కేస్ మూవీ టీమ్ సందడి

Hit 2 movie team hungama in Vizag, Hit 2 movie team hungama, Hit 2 movie team in Vizag, Hit 2 movie hungama, HIT: The Second Case, Hit 2 movie team, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie

వైజాగ్ లో HIT :ది సెకండ్ కేస్ మూవీ టీమ్ సందడి

Hit 2 movie team hungama in Vizag

Hit 2 movie team hungama in Vizag, Hit 2 movie team hungama, Hit 2 movie team in Vizag, Hit 2 movie hungama, HIT: The Second Case, Hit 2 movie team, Adivi Sesh, Meenakshi Chaudhary, Sailesh Kolanu, Adivi Sesh Latest Movie, Adivi Sesh's Upcoming Movie

హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్ , మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. భానుచందర్ , రావు రమేష్ , పోసాని , తనికెళ్ళ భరణి , కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించారు. జాన్ స్టీవర్ట్ ఎదురి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం హిట్ 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు . ఆదివారం వైజాగ్ లో HIT :ది సెకండ్ కేస్ మూవీ టీమ్ సందడి చేసింది . వైజాగ్ లో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో హీరో అడివి శేష్ మాట్లాడుతూ ... హిట్ 2 సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనీ , ఎప్పుడూ సరదాగా ఉండే పోలీస్ అధికారికి సవాల్ గా నిలిచిన హత్య కేసు ను ఎలా ఛేదించాడు అనేది హిట్ 2 సినిమా కథ అనీ , సినిమా మొత్తం వైజాగ్ నేపథ్యంలో జరుగుతుందని చెప్పిన ఆయన వైజాగ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందనీ , హీరో నాని తనకు మంచి మిత్రుడనీ , తన ప్రతీ సినిమాకు నాని సపోర్ట్ చేస్తున్నారనీ చెప్పారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం తనకు ఆనందంగా ఉందనీ , వైజాగ్ వాతావరణం తనకు బాగా నచ్చిందనీ చెప్పారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. సినిమాను వైజాగ్ లో 70 శాతం షూటింగ్ మూడు నెలలు పాటు తీశామనీ , ఇక్కడి ప్రజలు ఆత్మీయంగా చూసుకున్నారనీ చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్