గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. అలానే రీసెంట్ గా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా వచ్చింది. ఇక ఈసినిమా హిలోరియస్ ఎంటర్ టైనర్ గా మంటి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాకు ప్రేక్షకాదరణ లభించడంతో సంతోష్ శోభన్ తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో గోల్కొండ హైస్కూల్ చిత్రంలో నటించాను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని ఆనందపడుతుంటా. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను. నా లేటెస్ట్ మూవీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ కు మీరు చూపించిన ఆదరణ, మా వెంట మీరున్నారనే ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు దర్శకుడు మేర్లపాక గాంధీ, నాయిక ఫరియా అబ్దుల్లా ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: