కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్

Nenu Student Sir Movie Teaser Released, Nenu Student Sir Telugu Movie Teaser Released, Nenu Student Sir Teaser, Nenu Student Sir Movie Teaser, Bellamkonda Ganesh, Avantika Dassani, Rakhi Uppalapati, Ganesh Latest Movie, Ganesh's Upcoming Movie, Nenu

నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్

Nenu Student Sir Movie Teaser Released

Nenu Student Sir Movie Teaser Released, Nenu Student Sir Telugu Movie Teaser Released, Nenu Student Sir Teaser, Nenu Student Sir Movie Teaser, Bellamkonda Ganesh, Avantika Dassani, Rakhi Uppalapati, Ganesh Latest Movie, Ganesh's Upcoming Movie, Nenu

మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా డీసెంట్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్ప‌ల‌పాటీ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను అప్పుడే స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తాను కొత్తగా కొన్న ఐ ఫోన్ పోయిందని ... పోలీసులే దానిని కాజేశారని పోలీస్ స్టేషన్లో హీరో ఫిర్యాదు చేయడంపై ఈ టీజర్ మొదలవుతోంది. అతనిని ఎవరో ప్లాన్ చేసి రింగ్ లోకి నెట్టేసినట్టుగా హీరోతో సునీల్ చెబుతాడు. అతను చెప్పినట్టుగానే పోలీస్ ఆఫీసర్ సముద్రఖని హీరోను టార్గెట్ చేస్తాడు. దీనివల్ల హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అనేది ఈసినిమా అని అర్థమవుతుంది. చూద్దాం మరి ఈసినిమా గణేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసాని నటిస్తుంది. సునీల్ కూడా కీలక పాత్రలో పోషిస్తున్నారు.. ఈసినిమాను నాంది వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన ఎస్‌వీ2 ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాడి.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్