
హీరో సుమంత్ , దర్శకుడు సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ లో వారాహి అమ్మవారి నేపథ్యంలో మరో డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది.
జీ కే మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న వారాహి మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. నిర్మాత సురేష్ బాబు స్విచ్ ఆన్ చేయగా , దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ నిచ్చారు. ఈశ్వర్ చంద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ .. ఏడుగురు దేవతామూర్తులలో వారాహి అమ్మవారు ఒకరనీ , వరాహ శక్తి నుండి ఉద్బవించిన వారాహి అమ్మవారి నేపథ్యంలో వారాహి మూవీ తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. హీరో సుమంత్ మాట్లాడుతూ ... దర్శకుడు సంతోష్ ఈ కథ చెప్పగానే తనకు నచ్చిందనీ , సుబ్రహ్మణ్యపురం మూవీ కంటే వారాహి మూవీ స్క్రిప్ట్ చాలా బాగుంటుందనీ చెప్పారు.







