కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

3 రోజులకు 20 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న యశోద

Yashoda Movie Latest Collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda 2022, Yashoda Movie, Yashod
బాక్సాఫీస్1 ని. చదువు

3 రోజులకు 20 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న యశోద

Yashoda Movie Latest Collections

Yashoda Movie Latest Collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda 2022, Yashoda Movie, Yashod

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

యశోద మూవీ లో యశోద పాత్ర‌లో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యశోద మూవీ కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. ఓవర్సీస్ లో అద్భుత స్పందన తో దూసుకుపోతోన్న యశోద మూవీ 450K డాలర్స్ కు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ వీకెండ్‌లో హౌజ్‌ఫుల్ షోలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా కూడా స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లు సాధిస్తుండటంతో ఈ సినిమా మున్ముందు ఎలాంటి వసూళ్లను రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్