మొదటి నుండి విభిన్నమైన సినిమాలు చేయడంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పుడూ ముందుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పటివరకూ తనకు ఫ్లాప్స్ కంటే సక్సెస్ రేటే ఎక్కువ సొంతం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గానే ఎఫ్3 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ప్రస్తుతం అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించడం జరిగింది. అయితే రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు మరో సినిమా కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో హీరోయిన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ హీరోయిన్ గా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.
కాగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసన్స్ పిక్చర్స్ పై సిద్దు ముద్దా, నందు ఈసినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసినిమాను ఒకేసారి రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. గవెమిక్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో నటించే నటీ నటులు ఇతర వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: