పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ , విజయనిర్మల జంటగా కొన్ని హాలీవుడ్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో తెరకెక్కిన వెస్ట్రన్ యాక్షన్ కౌబాయ్ ఫిల్మ్ మోసగాళ్ళకు మోసగాడు 1971 ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.కృష్ణ కెరియర్ లో మైలురాయిగా నిలిచిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఇది మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ తారాగణం తో తెరకెక్కిన మోసగాళ్ళకు మోసగాడు మూవీ 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోవడం అప్పట్లో సంచలనం.35 సెంటర్లో విడుదల అయ్యి విజయం సాధించడంతో హిందీ, తమిళ భాషల్లోకి కూడా డబ్ చేశారు.ఆ తర్వాత ఇంగ్లీష్ లో కూడా ట్రెజర్ హంట్ అనే పేరుతో విడుదలైంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఎన్నో గొప్ప సినిమాలు తీసి టెక్నాలజీని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన హీరోగా కృష్ణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడ్డారు..ఇప్పుడు రాజమౌళి తీస్తున్న సినిమాలకు సంబంధించిన రికార్డుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ , ఆ రోజుల్లోనే మోసగాళ్ళకు మోసగాడు మూవీ ప్రపంచ వ్యాప్తం గా మొత్తంగా 63 దేశాల్లో విడుదల అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: