ప్రస్తుతం సౌత్ సినిమాల హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా సౌత్ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ వద్ద తమ సత్తా చూపించాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా మరోసారి సౌత్ సినిమా స్థాయిని పెంచేసింది. కన్నడలో వచ్చిన ఈసినిమా ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ అవుతూ బ్లాక్ బస్టర్ అవుతూ దూసుకుపోతుంది. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. దాంతో హిందీలో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక హిందీలో కూడా ఈసినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాను మరో లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమాను తుళు భాషలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది. తుళు డబ్బింగ్ వెర్షన్ డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలో ఇవ్వనున్నారట.
కాగా కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: