సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్

Superstar Krishna Sensational Records, Krishna Sensational Records, Superstar Krishna Is A Trendsetter In Telugu Cinema, Trendsetter In Telugu Cinema, Ghattamaneni Siva Rama Krishna Murthy, first cinemascope film, first Eastmancolor film, first DTS film, 70mm film, owboy films and spy films, Superstar Krishna Has Passed Away, Krishna Health Update, Krishna Health Latest Update, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హామ‌హుల‌కు సాధ్యం కాని ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ అసాధ్యుడిగా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆయ‌న సాధించిన ప‌లు రికార్డులు నేటికి చెక్కుచెద‌ర‌లేదు.తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఉన్నంత కాలం కృష్ణ రికార్డులు శాశ్వ‌తంగా నిలిచిపోతాయి.హీరోగా అత్య‌ధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా కృష్ణ‌ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎక్కువ మంది ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసిన ఏకైక హీరో కృష్ణ‌నే యాభై ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 108 మంది ద‌ర్శ‌కుల‌తో కృష్ణ సినిమాలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1965 నుంచి 2009 వ‌ర‌కు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా 44 ఏళ్ల పాటు కంటిన్యూ గా సినిమాలు చేసిన ఒకే ఒక హీరో కృష్ణ‌.1972 లో కృష్ణ న‌టించిన 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్‌లో ఒక ఏడాదిలో ఓ హీరో న‌టించిన అత్య‌ధిక సినిమాలు ఇవే. ఈ రికార్డ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేక‌పోయారు. .అత్య‌ధిక డ్యూయ‌ల్ రోల్స్ (దాదాపు 25 సినిమాలు), అత్య‌ధిక త్రిపాత్రాభిన‌యాలు (ఏడు సినిమాలు)చేసిన హీరో కృష్ణ‌నే.తెలుగు సినిమా చ‌రిత్ర‌లో తొలి జేమ్స్‌బాండ్ సినిమా కృష్ణ‌నే చేశాడు. గూఢ‌చారి 116 సినిమాతో జేమ్స్‌బాండ్ జోన‌ర్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశారు. మోస‌గాళ్ల‌కు మోస‌గాడు పేరుతో తొలి తెలుగు కౌబాయ్ సినిమాను కృష్ణ తెర‌కెక్కించారు. కృష్ణ న‌టించిన సింహాస‌నం తెలుగులో తొలి 70 ఎం.ఎం సినిమాగా చ‌రిత్ర‌కెక్కింది. తెలుగులో ఫుల్ స్కోప్ సినిమాగా కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రేమ్ న‌జీర్‌, శీల త‌ర్వాత అత్య‌ధిక సినిమాలు క‌లిసి చేసిన భార్యాభ‌ర్త‌లుగా కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల నిలిచారు.కృష్ణ‌తో క‌లిసి న‌టించిన హీరోయిన్ల సంఖ్య 90కిపైనే ఉంటుంది. ఇందులో విజ‌య‌నిర్మ‌ల‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవిల తో అత్యధిక సినిమాలలో జంటగా నటించి సూపర్ స్టార్ కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.