హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథగా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం హిందీ భాషలలో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. ఓటీటీలో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టెలివిజన్ లో కూడా సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈసినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అవుతుంది. మరి థియేటర్లలో అలానే ఓటీటీ లో చూడని వారు టీవీల్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈసినిమా ఎంగేజ్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాను వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: