
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 266


వరుణ్ పెళ్లి- నాగబాబు ఎమోషనల్ పోస్ట్

విరూపాక్ష కు టెక్నికల్ బ్రిలియన్స్ అవార్డ్

దేవర సెట్ ను మిస్ అవుతున్నా

డబుల్ ఇస్మార్ట్ క్రేజీ అప్డేట్

కోట బొమ్మాళి పీఎస్ రిలీజ్ డేట్ ఫిక్స్

డెవిల్ విడుదల వాయిదా

అదిరిపోయే రేంజ్ లో విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’లో రామ్ చరణ్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్’లో చరణ్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది. అకాడమీ నుంచి…

లియో తో మంచి లాభాలే వచ్చాయి-నాగవంశీ
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈసినిమా మిక్డ్స్ టాక్ ను తెచ్చుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఈసినిమా ఎప్పుడో 500 కోట్ల క్లబ్ లోకి వెళ్లిపోయింది. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా కలెక్షన్స్ విషయంలో పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది.

వరుణ్ పెళ్లి- నాగబాబు ఎమోషనల్ పోస్ట్
మెగా ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి సందడితో ఉన్న సంగతి తెలిసిందే కదా. మెగ ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎన్నో ఏళ్ల ప్రేమాయణం తరువాత ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థం జరగగా తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. మెగా పరివారంతో పాటు ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు కూడా ఈ వివాహానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మూడు రోజులాగా పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కాక్ టైల్ పార్టీ, హల్దీ ఇలా పలు వేడుకలు జరుగగా వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గత రాత్రి వరుణ్…

విరూపాక్ష కు టెక్నికల్ బ్రిలియన్స్ అవార్డ్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. ఇక ఈసినిమాకు కార్తీక్ దండు మేకింగ్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, విజువల్స్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. 100 కోట్లకు పైగా…

వెంకటేష్ చేతుల మీదుగా '90’s'. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ టీజర్ లాంఛ్
ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ ప్రధానపాత్రలో నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘90s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. వాసుకి ఆనంద్‌సాయి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్సిరీస్ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. కాగా ఈ ‘90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'ఈటీవీ విన్' యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ మేరకు బుధవారం స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా ఈ 90s టీజర్‌ని రిలీజ్ చేశారు.

ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. ఫోటోస్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వరుణ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా వారి కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. హాజరైన అతిథులు అక్షింతలతో నూతన వధూవరులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు.

బబుల్ గమ్- వెంకీ మామ చేతుల మీదుగా హబీబీ జిలేబీ సాంగ్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా . క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది

దేవర సెట్ ను మిస్ అవుతున్నా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్లను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన సోషల్ మీడియా ద్వారా అందిస్తూనే ఉన్నారు.

డబుల్ ఇస్మార్ట్ క్రేజీ అప్డేట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవలే 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ మూవీలో రామ్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్లో కనిపించి అలరించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. కాగా రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

మంగళవారం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫోర్త్ సింగిల్‌లో ఫేమస్ డైరెక్టర్
టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో అజయ్ భూపతి ఒకరు. తొలి ప్రయత్నంలోనే 'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా 'మహాసముద్రం' అనే సినిమాను రూపొందించగా.. అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా, ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. కాగా అజయ్ భూపతి ప్రస్తుతం మూడో సినిమాగా 'మంగళవారం' అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కోట బొమ్మాళి పీఎస్ రిలీజ్ డేట్ ఫిక్స్
మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకుంటూ వెళుతుంది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. ఇప్పటికే పలు సినిమాలు రాగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన లింగి లింగి లింగిడి అనే పాట ఎంత పాపులర్ అయిందే చూశాం. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది.

డెవిల్ విడుదల వాయిదా
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల వాయిదా పడింది.ముందు అనుకున్న ప్రకారం అయితే ఈనెల 24న ఈసినిమా థియేటర్లోకి రావాల్సి వుంది కానీ ఇప్పుడు ఆ డేట్ కు రావడం లేదని మేకర్స్ తెలియజేశారు.విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడం అలాగే సెకండ్ హాఫ్ ఆర్ ఆర్ పెండింగ్ ఉండడం తో సినిమా విడుదల వాయిదా పడింది.త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

హాయ్ నాన్న- ఇంట్రెస్టింగ్ గా అమ్మాడి సాంగ్ ప్రోమో
దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఈసినిమా వస్తుంద. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. మరి తండ్రి పాత్రలో నాని ఎలా చేస్తాడో జెర్సీ సినిమాలో ఇప్పటికే చూపించాడు. ఒక రకంగా ఆసినిమాలో తన నటనతో ఏడిపించేశాడు. ఇప్పుడు మరోసారి తండ్రీగా వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. మెహందీ వేడుక ఫోటోలు వైరల్
టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం మరికొన్ని గంటల్లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు (నవంబర్ 1, 2023) మధ్యాహ్నం గం. 2:18 ని.లకు వీరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఇటలీలోని టస్కనీలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహానికి హాజరయ్యేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో సందడి చేస్తోంది.

గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ పై థమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇంకా మహేష్ గుంటూరు కారం సినిమాలు ఫస్ట్ ఉంటాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉన్నాయి. మరోవైపు ఈసినిమాల నుండి అప్ డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఈరెండు సినిమాలకు సంబంధించిన ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ను ఇచ్చాడు థమన్. తన ట్విట్టర్ లో నవంబర్ వచ్చేసింది అంటూ గుంటూరు కారం, గేమ్ చేంజర్ లను యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు. కాగా ఈ రెండు సినిమాలకు ఫస్ట్ సింగిల్స్ నవంబర్ లోనే రాబోతున్న సంగతి తెలిసిందే కదా.

ఆదికేశవ- వరల్డ్ కప్ ఎఫెక్ట్.. మళ్లీ మారిన రిలీజ్ డేట్
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రుద్ర కాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపించనున్నాడు. మొదటిసారి ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సిత్తరాల సిత్రాంగి, లీలమ్మో అంటూ రెండు పాటలను రిలీజ్ చేశారు.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల హల్దీ వేడుక.. మెగాస్టార్ దంపతుల బ్లెస్సింగ్స్
టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటలీలోని టస్కనీలో ఈరోజు (నవంబర్ 1, 2023) వీరి వివాహం జరుగనున్న నేపథ్యంలో.. కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి సోదరుడు నాగబాబు తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఇటలీ చేరుకోగా.. అల్లు ఫ్యామిలీ కూడా వీరికి జత కలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ చేసింది.

గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే
మచ్ అవైటెడ్ గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తుంన్నారు.దసరాకు ఈసాంగ్ రిలీజ్ అవుతుందని ఎదురుచూశారు కానీ నిరాశే ఎదురైయింది.ఇక దసరాకి మిస్ అయినా దీపావళికి ఎలాగైనా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.అయితే అంత కన్నా కాస్త ముందుగానే రానుంది.ఈ విషయాన్ని సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ వెల్లడించాడు.కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన నాగవంశీ సాంగ్ ఎప్పడు వస్తుందో చెప్పేశాడు.గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రెడీ అయిపోయిందని కానీ సాంగ్ మీద అంచనాలు అందుకోవాలని ప్రతి సారి కరెక్ట్ చేసుకుంటున్నాం.ఈనెల మొదటి వారంలో సాంగ్ పక్కా రిలీజ్ ఉంటుందని…

వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీడాకోలా డైరెక్టర్ తరుణ్ భాస్కర్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'కీడాకోలా'. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న మూడవ చిత్రం ఇది. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం…

అదిరిపోయే రేంజ్ లో విక్రమ్ తంగలాన్ మూవీ టీజర్
విలక్షణ నటుడు విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు రిలీజ్ చేయగా పోస్టర్లతోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్.