డెవిల్ విడుదల వాయిదా 

The release of Devil is postponed

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ విడుదల వాయిదా పడింది.ముందు అనుకున్న ప్రకారం అయితే ఈనెల 24న ఈసినిమా థియేటర్లోకి రావాల్సి వుంది కానీ ఇప్పుడు ఆ డేట్ కు రావడం లేదని మేకర్స్ తెలియజేశారు.విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడం అలాగే సెకండ్ హాఫ్ ఆర్ ఆర్ పెండింగ్ ఉండడం తో సినిమా విడుదల వాయిదా పడింది.త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.ఇటీవల విడుదలైన టీజర్,సినిమాకు హైప్ తీసుకొచ్చింది.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నాడు.సంయక్త  మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించనుంది. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. డెవిల్ ను తెలుగు తోపాటు ఇతర భాషల్లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈసినిమా తరువాత కళ్యాణ్ రామ్ తన 21వ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో చేయనున్నాడు.ఇటీవలే ఈసినిమా లాంచ్ అయ్యింది. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుండగా ప్రముఖ నటి విజయ శాంతి  ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =