హాయ్ నాన్న- ఇంట్రెస్టింగ్ గా అమ్మాడి సాంగ్ ప్రోమో

Ammaadi song promo released from Hi Nanna movie

దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఈసినిమా వస్తుంద. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. మరి తండ్రి పాత్రలో నాని ఎలా చేస్తాడో జెర్సీ సినిమాలో ఇప్పటికే చూపించాడు. ఒక రకంగా ఆసినిమాలో తన నటనతో ఏడిపించేశాడు. ఇప్పుడు మరోసారి తండ్రీగా వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు. సమయమా అంటూ ఫస్ట్ రిలీజ్ చేసిన మెలోడిసాంగ్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన గాజ్ బొమ్మ అనే సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు మూడోపాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అమ్మాడి అంటూ వచ్చే మూడో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈపాటను నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో మాత్రం ఆకట్టుకుంటుంది. పాటలో నాని-మృణాల్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తుంది.

ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈసినిమాను డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =