మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలను అందుకుంటూ వెళుతుంది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. ఇప్పటికే పలు సినిమాలు రాగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన లింగి లింగి లింగిడి అనే పాట ఎంత పాపులర్ అయిందే చూశాం. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. నవంబర్ 24వ తేదీన ఈసినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
All set for an action packed thriller 💥💥#KotabommaliPS grand release on November 24th ❤🔥
The hunt begins with the teaser soon 💥#KotabommaliPSonNOV24@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @varusarath5… pic.twitter.com/3KnQBQ8Z6Y
— GA2 Pictures (@GA2Official) November 1, 2023
కాగా ఈసినిమాలో ఇంకా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: