గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ పై థమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

thaman interesting post on guntur kaaram and game changer movies

ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఇంకా మహేష్ గుంటూరు కారం సినిమాలు ఫస్ట్ ఉంటాయి. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉన్నాయి. మరోవైపు ఈసినిమాల నుండి అప్ డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈనేపథ్యంలోనే ఈరెండు సినిమాలకు సంబంధించిన ఒక సర్ ప్రైజింగ్ అప్ డేట్ ను ఇచ్చాడు థమన్. తన ట్విట్టర్ లో నవంబర్ వచ్చేసింది అంటూ గుంటూరు కారం, గేమ్ చేంజర్ లను యాడ్ చేస్తూ ట్వీట్ చేశాడు. కాగా ఈ రెండు సినిమాలకు ఫస్ట్ సింగిల్స్ నవంబర్ లోనే రాబోతున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో రిలీజ్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా గుంటూరు కారం. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నఈసినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =