వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. మెహందీ వేడుక ఫోటోలు వైరల్

Varun Tej-Lavanya Tripathi Wedding Colourful Mehendi Ceremony Pics Gone Viral

టాలీవుడ్‌ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం మరికొన్ని గంటల్లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు (నవంబర్‌ 1, 2023) మధ్యాహ్నం గం. 2:18 ని.లకు వీరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఇటలీలోని టస్కనీలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వివాహానికి హాజరయ్యేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో సందడి చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా మంగళవారం మెహందీ సంప్రదాయ వేడుక జరిగింది. కాగా ఈ వేడుకను పింక్ కలర్ థీమ్‍లో సెట్ చేయగా.. కాబోయే వధూవరులు ఇద్దరూ గులాబీ రంగు దుస్తులలో మెరిశారు. అలాగే వీరితో పాటు వేడుకలో పాల్గొన్న అతిథులు కూడా పింక్ కలర్ డ్రెస్ ధరించి సందడి చేశారు. ఇక వరుణ్ తేజ్ స్నేహితుడు, టాలీవుడ్ హీరో నితిన్ మరియు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోన హాజరవగా.. వీరు ఇతర రంగు దుస్తులు ధరించడం గమనార్హం. కాగా ప్రస్తుతం వరుణ్‌, లావణ్య త్రిపాఠి మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా దీనికి ముందు హల్దీ వేడుక జరుగగా.. దీనిని పసుపు రంగు థీమ్‍లో నిర్వహించారు.

ఇక సోమవారం రాత్రి వరుణ్-లావణ్య జంట అతిథులకు కాక్‌ టెయిల్‌ పార్టీ ఇవ్వగా.. ఈ పార్టీకి రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డి జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, నితిన్ తదితరులు కూడా హాజరయ్యారు. వీరితో పాటుగా మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని సందడి చేశారు. అయితే వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ సహా అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఇటలీలో వివాహ వేడుక తరువాత, నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, లావణ్య వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్ తేజ్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =