వెంకటేష్ చేతుల మీదుగా ’90’s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ టీజర్ లాంఛ్

Venkatesh Launches Shivaji's 90's A Middle Class Biopic Teaser

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ ప్రధానపాత్రలో నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘90s’. ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనేది ట్యాగ్ లైన్. వాసుకి ఆనంద్‌సాయి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్‌ మేడారం నిర్మిస్తున్నారు. కాగా ఈ ‘90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘ఈటీవీ విన్’ యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ మేరకు బుధవారం స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా ఈ 90s టీజర్‌ని రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు రెండు నిమిషాల నిడివి గల టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇక 1990ల కాలంనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ టీవీలో ‘మనోరంజని’ కార్యక్రమాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. ఇందులో శివాజీ ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా, స్కూల్‌ టీచర్‌గా కనిపించగా.. అతని భార్య పాత్రలో వాసుకి నటించారు. వీరి ముగ్గురు పిల్లలు, ఈ కుటుంబం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అలనాటి అందమైన జ్ఞాపకాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల ఆనందాలు, సరదాలు, సంఘర్షణలని ఎంతో అందంగా మనసుని హత్తుకునేలా చూపించాయి. శివాజీ, వాసుకి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పిల్లల పాత్రల్లో నటించిన నటులు కూడా చాలా హుషారుగా చక్కని నటన కనబరిచారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి మధ్యతరగతి పర్సన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌ని తీసుకొని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. ఇక వెబ్‌సిరీస్‌ ప్రొడక్షన్స్ వాల్యూస్ అయితే రిచ్‌గా టాప్ క్లాస్‌లో వున్నాయి. ‘విరాట పర్వం’ ఫేమ్ సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ప్లజెంట్‌గా ఆకట్టుకునేలా వుంది. అలాగే అజీమ్ మహ్మద్ ఫోటోగ్రఫీ చాలా లైవ్లీగా వుంది. కాగా శ్రీధర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కి, పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలకు పని చేసిన గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. అతని ఆర్ట్ వర్క్ బ్రిలియంట్‌గా వుంది. కాగా ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన కథగా దీనిని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =