టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కీడాకోలా’. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న మూడవ చిత్రం ఇది. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రవీంద్ర విజయ్, హరికాంత్, రఘురామ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా.. దర్శకుడు తరుణ్ భాస్కర్ మీడియా సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా వెంకటేష్‌తో సినిమా ఎందుకు ఆగిపోయిందనే ప్రశ్నకు తరుణ్ భాస్కర్ వివరణ ఇచ్చారు. గతంలో తమ కాంబినేషన్లో చేయాల్సిన సినిమా కొన్ని కారణాలతో డిలే అయిందని, అయితే త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తానని స్పష్టం చేశారు. ఈ సినిమా ఫస్టాఫ్ రెడీగా ఉందని, కానీ సెకండాఫ్ విషయంలో తాను అంత సంతృప్తిగా లేనని తెలిపారు. ప్రొడ్యూసర్ సురేష్ గారు షూటింగ్ స్టార్ట్ చేయమని అంటున్నారని, అయితే ఒక రచయితగా తాను సంతృప్తి చెందకుండా లొకేషన్‌కి వెళ్లలేనని ఆయన అన్నారు. త్వరలోనే ఈ కథ సెకండాఫ్ విషయంలో ఒక నిర్ణయానికి వస్తానని, ఆ తర్వాత వెంకటేష్‌తో సినిమాపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. ఇక ప్రస్తుతం తనవద్ద పైప్‌లైన్‌లో కొన్ని కథలున్నాయని, టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఒక కొత్త సినిమా లాక్ చేసానని, అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేయనున్నానని తరుణ్ భాస్కర్ వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: