వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల హల్దీ వేడుక.. మెగాస్టార్ దంపతుల బ్లెస్సింగ్స్

Megastar Chiranjeevi and Surekha Blesses Varun Tej & Lavanya Tripathi During Haldi Ceremony

టాలీవుడ్‌ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటలీలోని టస్కనీలో ఈరోజు (నవంబర్‌ 1, 2023) వీరి వివాహం జరుగనున్న నేపథ్యంలో.. కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి సోదరుడు నాగబాబు తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఇటలీ చేరుకోగా.. అల్లు ఫ్యామిలీ కూడా వీరికి జత కలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ షురూ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా మంగళవారం హల్దీ సంప్రదాయ వేడుక జరిగింది. కాగా ఈ వేడుకను ఎల్లో, వైట్‍, పింక్ థీమ్‍లో సెట్ చేయగా.. కాబోయే వధూవరులు ఇద్దరూ పసుపు రంగు దుస్తులలో మెరిశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ఎల్లో కలర్ డ్రెస్ ధరించారు. అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలో పాల్గొనగా.. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు లైట్ పింక్ కలర్ డ్రెస్ ధరించారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట ట్రెండింగ్‌లో ఉండగా.. వీటిలో వరుణ్, లావణ్య త్రిపాఠి కౌగిలించుకున్న ఫొటో మరియు మెగాస్టార్ దంపతులు వారితో ఉన్న మరో ఫోటో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక అంతకుముందు సోమవారం రాత్రి వరుణ్-లావణ్య జంట అతిథులకు కాక్‌ టెయిల్‌ పార్టీ ఇవ్వగా.. ఈ పార్టీకి రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డి జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, నితిన్ తదితరులు కూడా హాజరయ్యారు. వీరితో పాటుగా మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొని సందడి చేశారు. అయితే వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ సహా అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. ఇక ఇటలీలో వివాహ వేడుక తరువాత, నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, లావణ్య వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =